స‌ర్కార్ ఆడియో వేడుక‌కి చీఫ్ గెస్ట్‌గా త‌లైవా..!

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి త‌మిళంలో ఏ రేంజ్ క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఆయ‌న సినిమా కోసం అభిమానులు వేయి క‌ళ్ళ‌తో ఎదురు చూస్తుంటారు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న స‌ర్కార్ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్‌. సెప్టెంబర్ 13న వినాయక చవితి సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్ విడుద‌లకి ప్లాన్ చేసిన టీం చిత్ర ఆడియో వేడుక‌ని అక్టోబ‌ర్ 2న చెన్నైలో గ్రాండ్‌గా జ‌రిపేందుకు స‌న్నాహాలు చేస్తుంది. అయితే ఈ వేడుక‌కి త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ని గెస్ట్‌గా ఆహ్వ‌నించాల‌ని టీం భావిస్తుంద‌ట‌. ఇప్ప‌టికే తెలుగులో ఒక స్టార్ హీరో ఫంక్ష‌న్‌కి మ‌రో స్టార్ హీరో అతిధిగా వ‌చ్చే ట్రెండ్ న‌డుస్తుండ‌గా, ఇప్పుడు త‌మిళంలో కూడా ఇది మొద‌లైంద‌ని అంటున్నారు. ర‌జ‌నీకాంత్ క‌నుక ఈ ఆడియో వేడుక‌కి హాజ‌రైతే మాత్రం ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్‌ని ఒకే వేదిక‌పై చూసే అభిమానుల‌కి రెండు క‌ళ్ళు సరిపోవు. స్టార్‌ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ త‌న 62వ సినిమాగా స‌ర్కార్‌ చేస్తున్నాడు. సన్ పిక్చ‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి గిరీష్ గంగాధ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌నుండ‌గా, శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, టీ సంతానం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు. దీపావ‌ళి కానుక‌గా ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది.

Related Stories: