రైతు, జ‌వాన్‌ల‌కి సాయం చేయ‌నున్న ర‌జ‌నీ, బిగ్ బీ

దేశానికి వెన్న‌ముక రైతు. దేశ భూభాగాన్ని పరిరక్షించడం కోసం ఎల్ల వేళ‌లా అప్ర‌మ‌త్తంగా ఉండే వారు జవాన్. వీరు క‌ష్టాల‌లో ఉన్న‌ప్పుడు సాయం చేయాల‌నే భావ‌న ఇప్పుడు కొంద‌రిలో క‌లుగుతుంది. ముఖ్యంగా మ‌న సెల‌బ్రిటీలు కొంద‌రు పెద్ద మ‌న‌సు చేసుకొని అమర జవాన్ల కుటుంబాలకు, ఇబ్బందుల్లో ఉన్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కొన్నాళ్లుగా బాలీవుడ్ మీడియా అమితాబ్ రైతుల‌కి, జ‌వాన్‌ల‌కి సాయం చేయ‌బోతున్న‌ట్టు క‌థ‌నాలు ప్ర‌చురిస్తుంది. ఈ మేర‌కు ఆ విష‌యాన్ని ధ్రువీక‌రిస్తూ అమితాబ్ త‌న ట్విట్ట‌ర్లో ‘అవును నేను చేయగలను.. చేస్తున్నాను’ అంటూ ఆ వార్తల లింకులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇక సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా రైతుల కోసం కోటి రూపాయ‌లు, అమ‌ర జ‌వాన్ల కోసం కోటి రూపాయ‌లు సాయం చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. అప్పుల్లో మునిగిపోయిన రైతుల కుటుంబాలకు రుణాల నుంచి విముక్తి కలిగించేలా రజనీకాంత్ సాయం ఉంటుంద‌ని కోలీవుడ్ టాక్. అమితాబ్ ప్ర‌స్తుతం అమితాబ్ ప్ర‌స్తుతం ‘బ్రహ్మాస్త్రా’, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణలతో బిజీగా ఉండ‌గా, ర‌జనీకాంత్ త‌న 168వ చిత్రం కోసం విదేశాల‌లో ఉన్నాడు. కార్తీక్ సుబ్బ‌రాజు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.
× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..