మ‌రోసారి రాజ‌మౌళితో చేయి క‌లిపిన హిందీ ఫిలింమేక‌ర్

ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడు రాజ‌మౌళి తీసిన ప్ర‌తి సినిమా విజ‌య దుందుభి మ్రోగిస్తూనే ఉంది. బాహుబ‌లి చిత్రంతో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజ‌మౌళి ప్ర‌స్తుతం మల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించనున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో వున్న రాజమౌళి ఈ చిత్రాన్ని 1980 కాలం నాటి కథ నేపథ్యంలో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం 1947 నాటి బ్రిటీష్ కాలం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో రాజమౌళి సర్వం సిద్ధం చేస్తున్నారని, స్వాతంత్య్ర సమరకాలంలో జరిగిన కొన్ని ఘట్టాల్ని కూడా ఈ చిత్రంలో చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం.

ఆర్ ఆర్ ఆర్ మూవీలో రాజమౌళి మార్కు భారీ సెట్‌లు, అబ్బురపరిచే గ్రాఫిక్స్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచే అవకాశం వుందని చిత్ర వర్గాల సమాచారం. అయితే బాహుబ‌లి రెండు పార్టుల హిందీ రైట్స్ ద‌క్కించుకున్న క‌ర‌ణ్ జోహార్ ఇప్పుడు మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ హిందీ వ‌ర్షెన్ కోసం ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసాడ‌ట‌. దీనిపై నిర్మాత‌లు పాజిటివ్‌గానే స్పందించిన‌ట్టు తెలుస్తుంది. చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు సోద‌రులుగా కనిపించ‌నుండ‌గా, ఇందులో ఒక‌రు పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. మ‌రొక‌రు అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ పాత్ర పోషిస్తున్నార‌ట‌. అక్టోబ‌ర్‌లో చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం.

Related Stories: