రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్ : వాయువ్య ఒడిశా, పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం కొనసాగుతున్నది. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముండగా..ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Related Stories: