మరో 36 గంటలు వర్షసూచన

హైదరాబాద్ : రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో సోమవారం గ్రేటర్‌లోని పలుచోట్ల వర్షం కురిసిన విషయం విదితమే. రానున్న 36 గంటల్లో గ్రేటర్‌లోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండి సాయంత్రం ఒక్కసారిగా వాన పడింది. బంజారాహిల్స్, ఖైరతాబాద్, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, మలక్‌పేట, రాజేంద్రనగర్, అత్తాపూర్, కార్వాన్, పాతబస్తీ, నాంపల్లి, అబిడ్స్, మాదాపూర్, శేరిలింగంపల్లి, హయత్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 1.4 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు