గ్రేటర్‌పై తగ్గిన తుఫాను ప్రభావం

హైదరాబాద్ : వాయువ్య బంగాళఖాతంలో ఏర్పడిన డయీ తుఫాను ప్రభావం గ్రేటర్‌పై తగ్గినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలపై ఈ ప్రభావం కొనసాగుతున్నప్పటికీ నగరంపై తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు. నైరుతీ రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో రాగల 24గంటల్లో తేలిక పాటి జల్లులు పడవచ్చని అధికారులు తెలిపారు. గాలిలో తేమశాతం తగ్గడంతో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని, దీని వల్ల మధ్యాహ్నం సమయంలో కొంత ఉక్కపోత ఏర్పడవచ్చని వాతావరణశాఖ అధికారులు వివరించారు.

Related Stories: