రైలు ప్రమాద ఘటనలో ఇద్దరు అధికారుల సస్పెన్షన్

న్యూఢిల్లీ: న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాద ఘటనలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్టు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. సిగ్నల్ ఇన్‌స్పెక్టర్, ఎలక్ట్రికల్ సిగ్నల్ నిర్వాహకుడిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ప్రాథమిక విచారణలో ప్రమాదానికి కారణం తప్పుడు సిగ్నల్ చూపడమేనని తెలుస్తుందన్నారు. రైల్వే భద్రత చీఫ్ కమిషనర్ ఆదేశాల మేరకు బచ్రవ సిగ్నలింగ్ విభాగానికి చెందిన సీనియర్ సెక్షన్ ఇంజినీర్ వినోద్‌కుమార్ శర్మను, కుదన్‌గంజ్‌కు చెందిన ఎలక్ట్రికల్ సిగ్నలింగ్ నిర్వాహకుడు అమర్‌నాథ్‌ను సస్పెండ్ చేసినట్టు నార్తర్న్ రైల్వే అధికార ప్రతినిధి దీపక్‌కుమార్ తెలిపారు. రాయ్‌బరేలీ వద్ద బుధవారం న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్ రైలు ఐదు బోగీలు పట్టాలు తప్పిన ప్రమాదంలో ఐదుగురు మరణించగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
× RELATED ములకలపల్లి ఎస్సైపై సస్పెన్షన్ వేటు