రాహుల్‌గాంధీని ఓడించిన స్మృతిఇరానీ

యూపీ: ఉత్తరప్రదేశ్‌లో కీలకమైన అమేథీ లోక్‌సభ నియోజకవర్గ స్థానంలో ఇవాళ ఉదయం ఎన్నికల కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి హోరాహోరి పోటీ నెలకొన్నది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఒకరిపై మరొకరు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. అమేథీ నుంచి ఎవరు గెలుస్తారా అన్న ఉత్కంఠకు తెరపడింది. కౌంటింగ్ ముగిసే సమయానికి రాహుల్‌గాంధీపై స్మృతి ఇరానీ 35వేలకుపైగా మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గం నుంచి రాహుల్‌గాంధీపై పోటీ చేసి ఓడిపోయిన స్మృతి ఇరానీ..ఈ సారి అనూహ్యంగా భారీ మెజార్టీతో గెలుపొంది..చరిత్ర సృష్టించారు.