రాచకొండ పరిధిలో ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు: సీపీ

రంగారెడ్డి: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ మహేవ్ భగవత్ ప్రకటించారు. ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో 1600 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నామినేషన్ వేసిన అభ్యర్థులు కోరితే నిబంధనల ప్రకారం భద్రత కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు 693 తుపాకులు, ఆయుధాలు వెనక్కి తీసుకున్నామని పేర్కొన్నారు. నామినేషన్ వేసే కార్యాలయాల వద్ద డీఎస్పీ స్థాయి అధికారితో భద్రతా ఏర్పాట్లు చేశాం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3087 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. ఇందులో 400 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. పోలింగ్ బూత్ లోపల, వెలుపల రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. 3700 పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నాం. రంగంలోకి మరో 14 పారామిలటరీ బలగారు దించామన్నారు. ఎవరైనా సి-విజల్ యాప్ ద్వారా నేరుగా ఈసీకి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Related Stories: