అశ్విన్‌కు భారీ జరిమానా!

న్యూఢిల్లీ: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు భారీ జరిమానా పడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా అశ్విన్‌కు రూ.12లక్షల ఫైన్‌ వేశారు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఎక్కువగా బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ కూర్పులతో స‌మ‌యాన్ని వృథా చేశాడు. ప్రస్తుత సీజన్‌లో స్లో ఓవర్‌రేట్‌ నమోదు కావడం అశ్విన్‌తో పాటు ఆ జట్టుకు ఇదే తొలిసారి. శనివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. అనంతరం ఛేధనలో ఢిల్లీ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఐపీఎల్‌-12వ సీజన్‌లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రాజస్థాన్‌ రాయల్స్‌ మాజీ సారథి ఆజింక్య రహానె, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీలకు స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా జరిమానా పడిన విషయం తెలిసిందే.
More in క్రీడలు :