కేదార్ నాథ్..'ఖాఫిరానా'వీడియోసాంగ్

ముంబై: సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సారా అలీఖాన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కేదార్ నాథ్. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో కేదార్ నాథ్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగే ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా చిత్రయూనిట్ ఈ చిత్రంలోని 'ఖాఫిరానా..ఇష్క్ యా క్యాహై' అంటూ సాగే మూడో వీడియో సాంగ్ ని విడుదల చేసింది. లవ్ ట్రాక్ సన్నివేశాలతో వచ్చే ఈ పాట ప్రేక్షకులకు ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. వరదల సమయంలో ఓ జంట మధ్య చిగురించిన ప్రేమకథగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు డైరెక్టర్. కేదార్ నాథ్ డిసెంబర్ 7న విడుదల కానుంది.

Related Stories: