కొండచిలువను కోసి.. మహిళను బయటకు తీశారు.. వీడియో

జకర్తా: ఇండోనేషియాలో ఓ భారీ కొండచిలువ ఓ మహిళను మింగిన సంగతి తెలిసిందే. మునా ఏజెన్సీలో ఈ ఘటన జరిగింది. 8 మీటర్ల కొండచిలువను కోయగా.. దాని కడుపులో 54 ఏళ్ల వా తిబా అనే గృహిణి శరీరం బయటపడింది. కొండచిలువను కోసి మహిళను బయటకు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదే ఆ వీడియో.

అసలేం జరిగింది

ఇంటి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న మొక్క జోన్న చేనుకు వెళ్లిన తర్వాత ఆమె కనిపించకుండాపోయింది. పందులు పంటను నాశనం చేస్తున్నాయని, వాటిని వెళ్లగొట్టాలన్న ఉద్దేశంతో ఆమె తన ఇంటి వద్ద ఉన్న మొక్క జొన్న చేనుకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె అదృశ్యమైనట్లు తెలిసింది. మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా ఆమె తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో గ్రామస్తులు ఓ భారీ పైతాన్‌ను కనుగొన్నారు. ఆ కొండచిలువను కోయడంతో దాని కడుపులో నుంచి ఆ మహిళ మృతదేహం బయటపడింది. దానికి సంబంధించిన వీడియో చూడండి...
× RELATED కూల్‌డ్రింక్‌లో మత్తుమందిచ్చి ఆభరణాలు చోరీ