ముళ్లపంది ఉచ్చులో చిక్కుకున్న కొండ చిలువ

మహబూబ్‌నగర్: ముళ్ల పందుల కోసం అమర్చిన ఉచ్చులో కొండ చిలువ చిక్కుకున్న సంఘటన జిల్లాలోని కోయిలకొండ మండలం కొత్లాబాద్ గ్రామ సమీపంలో చోటు చేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కొత్లాబాద్ గ్రామ సమీపంలోని కొయ్యగుండు వద్ద ముళ్ల పందుల కోసం మూడ్రోజుల కిందట ఉచ్చు బిగించారు. ఈ ఉచ్చులో కొండ చిలువ చిక్కుకున్నది.

కొండ చిలువ చేసిన అరుపులు(విజిల్ సౌండ్) విన్న మేకల కాపరులు అక్కడికి వెళ్లి పరిశీలించగా 8 అడుగుల కొండ చిలువ కనిపించింది. వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో ఉపసర్పంచ్ బాబు జిల్లా అటవీ శాఖాధికారి గంగారెడ్డికి ఫోన్‌లో సమాచారం అందించారు. ఆయన స్పందించి పిల్లలమర్రి నుంచి ప్రత్యేక అటవీ అధికారుల బృందాన్ని పంపించారు. వారు కొండచిలువను ఉచ్చు నుంచి బయటకు తీసి పిల్లలమర్రి సంరక్షణ కేంద్రానికి తరలించారు.

× RELATED కివీస్ కెప్టెన్ ఒంట‌రి పోరాటం