పూరిజగన్నాథ్ దర్శకత్వంలో..?

రామ్ నటించిన తాజా చిత్రం హలో గురూ ప్రేమ కోసమే. ఇటీవల విడుదలైన ఈ చిత్రం రామ్‌కు ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. ఈ సినిమా తరువాత అయన పక్కా మాస్ మసాలా చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలిసింది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. హలో గురూ ప్రేమ కోసమే సినిమా విడుదలకు ముందే రామ్‌కు దర్శకుడు పూరిజగన్నాథ్ లైన్ వినిపించాడని, అది ఇప్పటికి ఓకే అయిందని తాజా సమాచారం. గత కొంత కాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న పూరిజగన్నాథ్ హీరో రామ్ కోసం ఓ పవర్‌ఫుల్ స్టోరీని సిద్ధం చేస్తున్నాడని, ఇందులో రామ్ గెటప్, లుక్ కొత్తగా వుంటాయని, ఫిబ్రవరిలో చిత్రాన్ని లాంఛనంగా సెట్స్‌పైకి తీసుకురానున్నారని తెలిసింది. హలో గురూ ప్రేమ కోసమే అనుకున్నంతగా సంతృప్తినివ్వలేకపోయినా ఆదరించారు. దీనికి బదులుగా ఈ సారి వడ్డీతో సహా మీకు తిరిగిచ్చేస్తాను అంటూ రామ్ సోషల్ మీడియా ట్విట్టర్‌లో చేసిన ట్వీట్ తాజా వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది.