వైద్య, ఆరోగ్యశాఖలో 660 పోస్టుల భర్తీ

-ఆర్థికశాఖ ఆమోదం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల పరిధిలో 660 ఖాళీలను భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థికశాఖ అనుమతించిన 660 పోస్టుల్లో వైద్య విద్య విభాగంలో 148, ఆరోగ్యశాఖ డైరెక్టరేట్ పరిధిలో 457, తెలంగాణ వైద్యవిధానపరిషత్ పరిధిలో 55 పోస్టులు ఉన్నాయి. పోస్టుల భర్తీ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. వైద్యవిద్య డైరెక్టరేట్ పరిధిలో భర్తీ చేయనున్న పోస్టులు అనాటమీ-11, ఫిజియాలజీ-5, బయోకెమిస్ట్రీ-6, ఫార్మకాలజీ-7, మైక్రోబయాలజీ-5, పాథాలజీ-5, ఫోరెన్సిక్ మెడిసిన్- 6, కమ్యూనిటీ మెడిసిన్-4, జనరల్ మెడిసిన్ -2, పెడియాట్రిక్-9, డీవీఎల్-1, సైకియాట్రి-5, టీబీసీడీ-1, జనరల్ సర్జరీ-2, ఆర్థోపెడిక్-2, ఈఎన్‌టీ-2, ఆఫ్తాల్మాలజీ-5, ఆబ్సెట్రిక్స్ అండ్ గైనకాలజీ-11, అనెస్థీషియా-9, రేడియో డయాగ్నసిస్-5, రేడియోథెరఫీ-1, ప్లాస్టిక్ సర్జరీ-1, న్యూరాలజీ-1, పీడియాట్రిక్ సర్జరీ-4, న్యూరో సర్జరీ- 4, యూరాలజీ-5, సీటీ స్కాన్-3, కార్డియాలజీ-6, గ్యాస్ట్రోఎంట్రాలజీ-5, ఎండోక్రైనాలజీ-2, నెఫ్రాలజీ-5, న్యానటాలజీ-2, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ-1, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్-1, ఎమర్జెన్సీ మెడిసిన్-3, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్-1. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టరేట్ పరిధిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-8, రేడియోగ్రాఫర్-16, స్టాఫ్ నర్స్-382, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్-1, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2-25, ఫార్మాసిస్ట్ గ్రేడ్-2-25. తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనరేట్ పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గైనకాలజీ-10, సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనెస్థీషియా-12, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పెడియాట్రిక్స్-2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఆర్థోపెడిక్స్-2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఈఎన్‌టీ-8, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పాథాలజీ-6, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ మెడిసిన్-8, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ సర్జరీ-5, సివిల్ అసిస్టెంట్ సర్జన్ సైకియాట్రి-2.

Related Stories: