అనుమానితుల వివరాలు చెబితే భారీ నజరానా

అమృత్‌సర్: అమృత్ సర్ లోని రాజసాన్సీ ప్రార్థనా మందిరంపై గ్రనేడ్‌ దాడికి పాల్పడిన వారి ఆచూకీ చెప్పినవారికి రూ.50 లక్షల రివార్డు అందజేస్తామని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. దాడికి పాల్పడిన అనుమానితుల సమాచారాన్ని పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 181కి ఫోన్ చేసి చెప్పవచ్చునన్నారు. అనుమానితుల సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచనున్నట్లు చెప్పారు. అమృత్‌సర్ జిల్లా రాజ్‌సన్సి గ్రామంలోని నిరంకారి భవన్ దగ్గర జరిగిన ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందగా..మరో పది మంది గాయపడ్డారు.

Related Stories: