130 మందికి పైగా ఎంపీడీవోలకు పదోన్నతులు

హైదరాబాద్ : రాష్ట్రంలో 130 మందికి పైగా ఎంపీడీవోలకు పదోన్నతులు లభించాయి. ఎంపీడీవోల పదోన్నతుల దస్త్రంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ సంతకం చేశారు. 21 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎంపీడీవోలు ఎదురుచూస్తున్నారు. పదోన్నతుల ఆకాంక్ష నెరవేర్చిన సీఎం కేసీఆర్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఎంపీడీవోలు కృతజ్ఞతలు తెలిపారు.
× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు