రేపటి నుంచి 5 రాష్ర్టాల్లో థియేటర్లు బంద్..

హైదరాబాద్ : రేపటి నుంచి 5 రాష్ర్టాల్లో థియేటర్లను బంద్ చేయనున్నట్లు దక్షిణాది నిర్మాతల మండలి ప్రకటించింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ దక్షిణాది నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత డి సురేశ్‌బాబు వెల్లడించారు. తెలుగు రాష్ర్టాలతోపాటు తమిళనాడు, కేరళ, కర్నాటకలో థియేటర్లు బంద్ కానున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత డి సురేశ్‌బాబు మాట్లాడుతూ ఇంగ్లీష్ సినిమాలకు వర్చువల్ ప్రింట్ ఫీజు వసూలు చేయడం లేదన్నారు. డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు ప్రాంతీయ చిత్రాలకు వీపీఎఫ్ తగ్గించట్లేదన్నారు. ఐదు రాష్ర్టాల్లోని నిర్మాతలు, పంపిణీ దారులు తమకు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. వీపీఎఫ్ ధరలు సున్నా చేయడం లేదన్నారు. డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు దిగి వచ్చే వరకు థియేటర్ల బంద్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
× RELATED నేను తాతనని ఒప్పకున్నాడు..