కన్నుగీటు ప్రియకు సుప్రీంకోర్టులో ఊరట

కన్నుగీటుతో ప్రపంచాన్ని కట్టిపడేసిన ప్రియా ప్రకాశ్ వారియర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెపై వేసిన పోలీసు కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ప్రథమ సమాచార నివేదికను రద్దుచేసింది. పైగా పోలీసులకు బాగా తలంటు పోసింది. తమ మతం కన్నుకొట్టడాన్ని అనుమతించదంటూ ముఖీత్ ఖాన్, జహీరుద్దీన్ అలీఖాన్ అనే ఇద్దరు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా హైదరాబాద్ పోలీసులు కేసునమోదు చేశారు. సినిమాలో ఎవరో ఏదో పాట పాడుతారు. మీకు కేసు నమోదు చేయడం తప్ప వేరే పనేమీ లేదా? అని పోలీసులకు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా చురకలు వేశారు. ఒరు ఆధార్ లవ్ అనే సినిమాలోని పాటలో ప్రియ కన్నుగొట్టే సీన్ ఉంటుంది. మతపరమైన భావాలను దెబ్బతీశారని ఆమెపై, దర్శకునిపై పోలీసులు కేసుపెట్టారు. అయితే ఈ ఆరోపణలు ప్రియకు వర్తించవని కోర్టు స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమంలో ఈ పాట, ప్రియ అభినయం సంచలనం సృష్టించాయి.

Related Stories: