బీజేపీ శ్రేణుల‌కి కృత‌జ్ఞ‌తలు తెలిపిన మోదీ త‌ల్లి

న‌రేంద్ర‌మోదీ త‌ల్లి హీరాబెన్ (98) బీజేపీ శ్రేణుల‌కి కృత‌జ్ఞ‌తలు తెలిపారు. 2019 లోక్ స‌భ ఎల‌క్ష‌న్స్‌లో బీజేపీ ఘ‌నమైన విజ‌యం సాధిస్తున్న నేప‌థ్యంలో మీడియా ముందుకి వ‌చ్చిన హీరాబెన్ పార్టీ కోసం పని చేసిన ప్ర‌తి ఒక్కరికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. హీరాబెన్ ప్ర‌స్తుతం గాంధీ న‌గ‌ర్‌లోని రైసీన్ గ్రామంలో ఉంటున్నారు. వారణాసీలో ఓటు వేసే ముందు మోదీ త‌న త‌ల్లి ఆశీర్వాదం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో దూసుకుపోతున్నారు. రెండోసారి కాశీ నుంచి పోటీ చేస్తున్న మోదీ త‌న స‌త్తా చాటారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పోలైన ఓట్ల‌లో.. మోదీ ఖాతాలోనే 63 శాతం ఓట్లు ప‌డ్డాయి. మోదీపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్య‌ర్థి అజ‌య్ రాయ్‌కు కేవ‌లం 53 వేల ఓట్లు మాత్ర‌మే పోల‌య్యాయి. మోదీ క‌న్నా సుమారు రెండు ల‌క్ష‌ల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఓట‌మి పాల‌య్యారు.