మొసలి దాడిలో పూజారికి గాయాలు

ధరూర్ : నారదగడ్డ చెన్నబసవేశ్వర స్వామి అర్చకుడు సిద్ధయ్య స్వామి మొసలిదాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నాగర్‌దాడ్డి సమీపంలోని కృష్ణానదిలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధయ్య స్వామి, ఈశ్వరయ్యలు నారదగడ్డ దేవాలయం పూజారులుగా పని చేస్తున్నారు. నాగర్‌దొడ్డిలో నివాసం ఉంటున్న వీరు ప్రతి రోజూ దివిలో ఉన్న నారదగడ్డ దేవాలయానికి అర్చకత్వం నిమిత్తం పుట్టిలో వెళ్తారు. రోజూలాగే వెళ్లి, స్నానం కోసం నదిలోకి వెళ్లిన సిద్ధయ్య కుడికాలుని మొసలి పట్టింది. పక్కనే ఉన్న ఈశ్వరయ్య ఈ విషయాన్ని గ్రహించి, చేయిపట్టి ఒడ్డుకు లాగడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. అప్పటికే కుడికాలుకి తీవ్రంగా గాయం కావడంతో వెంటనే సిద్ధయ్య స్వామిని గద్వాలలోని ప్రైవేటు దవాఖానాలో చేర్పించి చికిత్స చేయించారు.

Related Stories: