కొండగట్టు ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు, గాయపడిన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబసభ్యులకు రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండి, వారిని ఆదుకుంటుందని ఆశిస్తున్నానన్నారు. ఈ మేరకు తన సంతాపాన్ని ప్రకటిస్తూ రాష్ట్రపతి తెలుగులో ట్వీట్ చేశారు.

Related Stories: