ధోనీకి పెద్ద అభిమానిని.. చెన్నై గెలుస్తుంది!

ముంబై: వరుసగా పదకొండో సీజన్‌లోనూ ఐపీఎల్ టైటిల్‌కు ఎంతో దూరంలో నిలిచిపోయింది ప్రీతి జింటా టీమ్ కింగ్స్ పంజాబ్. కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరకుండా ఇంటిదారి పట్టింది. మొదట్లో ఆరు మ్యాచుల్లో ఐదు గెలిచి ఊపు మీద కనిపించిన ఆ టీమ్.. తర్వాత 8 మ్యాచుల్లో ఏడు ఓడిపోయి లీగ్ స్టేజ్‌తోనే సరిపెట్టుకుంది. ఇప్పుడామె టీమ్ రేసులో లేకపోవడంతో తన తర్వాతి ఫేవరెట్ చెన్నై సూపర్ కింగ్సే అంటున్నది ప్రీతి జింటా. నిజానికి ఈ చెన్నై టీమ్ చేతిలోనే చివరి మ్యాచ్‌లో ఓడి పంజాబ్ ఇంటికెళ్లిపోయింది.

అయితే ధోనీకి తాను పెద్ద అభిమానిని అని, చెన్నై టీమే ఈసారి ఐపీఎల్ గెలుస్తుందని ప్రీతి ట్వీట్ చేసింది. తమ టీమ్‌తో ఆడనంత వరకు తనకు అన్ని టీమ్స్ ఇష్టమే అయినా.. ధోనీపై మాత్రం ప్రత్యేక అభిమానం ఉందని ప్రీతి ఆ ట్వీట్‌లో చెప్పింది. తన అభిమానులతో జరిగిన చాట్ సెషన్‌లో ప్రీతి ఈ కామెంట్స్ చేసింది.

× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు