రెండేళ్ల విరామం తర్వాత తెలుగు చిత్రంలో..

మహేశ్ బాబుతో కలిసి నటించిన ‘బ్రహ్మోత్సవం’ తర్వాత మరే తెలుగు సినిమాలో కనిపించలేదు ప్రణీత. సుమారు రెండేళ్ల విరామం తర్వాత రామ్ తో కలిసి హలో గురు ప్రేమ కోసమే చిత్రంలో నటిస్తుంది. తెలుగులో కొత్త సినిమాకు ఇంత గ్యాప్ రావడానికి కారణమేంటో చెప్పింది ప్రణీత. తెలుగులో తనకు నచ్చే స్ర్కిప్టులు రాకపోవడం వల్లే ఇక్కడ సినిమా చేయకుండా..కన్నడ, తమిళ సినిమాలు చేస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇన్నాళ్ల తర్వాత తనకు మంచి పాత్ర దొరకడంతో రామ్ తో కలిసి నటించేందుకు రెడీ అయిందట ప్రణీత. ఈ చిత్రంలో తాను పట్టణ యువతిగా కనిపిస్తానని, ఈ పాత్ర కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది.

× RELATED కాంగ్రెస్, టీడీపీల పొత్తు అనైతికం: మంత్రి కేటీఆర్