పౌరులంతా అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశ్ రాజ్

శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో చోటుచేసుకున్న వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు 140మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. కొలంబో పేలుడు ఘటనపై పలువురు దేశాధినేతలు ఇప్పటికే ఖండించారు. కొలంబో దాడి ఘటనపై పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. కొలంబోలో ప్రజలు ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు మనల్ని దహించివేస్తాయి. ద్వేషం పేరుతో సమాజాన్ని విడదీయాలని చూస్తున్న..మూఢ విశ్వాసనీయుల చర్యలను ఖండించాల్సిన అవసరముంది. విద్వేష పూరిత దాడుల నేపథ్యంలో పౌరులంతా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. భయంకరమైన దాడుల పట్ట షాక్ కు గురయ్యాను. ఈస్టర్‌ పర్వదినా ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఇలాంటి దాడికి పాల్పడినందుకు ఉగ్రవాదులు సిగ్గుపడాలి. పేలుడులో గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలి. మృతుల కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నా. మేమంతా మీకు అండగా ఉన్నామని బాలీవుడ్ యాక్టర్ వివేక్‌ ఒబెరాయ్‌ ట్వీట్ చేశాడు. శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెలిసి చాలా బాధపడ్డా. శ్రీలంక ప్రజలు క్షేమంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని కోలీవుడ్ నటుడు విశాల్‌ ట్వీట్ చేశాడు.

Related Stories: