జపాన్‌లో 6.7 తీవ్రతతో భూకంపం

టోక్యో: జపాన్‌లో శక్తివంతమైన భూకంపం వచ్చింది. హొక్కైడో దీవిలో 6.7 తీవ్రతతో భూకంపం నమోదు అయ్యింది. దీంతో అక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి. అనేక ఇండ్లు నేలమట్టం అయ్యాయి. దీవి మొత్తం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఆ దీవిలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను కూడా స్విచాఫ్ చేశారు. టొమోకొమై సిటీ కేంద్రంగా భూకంపం వచ్చింది. హొక్కైడో దీవిలో సుమారు 20 లక్షల జనాభా ఉంది. ఇవాళ ఉదయం సంభవించిన భూకంపం వల్ల సుమారు 125 మంది గాయపడ్డారు. మరో 20 మంది కనిపించకుండాపోయారు. యోషినో జిల్లాలో అయిదుగురు చనిపోయినట్లు స్థానిక మంత్రి ఒకరు తెలిపారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Related Stories: