రూ.3,999 కే పోర్ట్రోనిక్స్ మఫ్స్ ఆర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్

పోర్ట్రోనిక్స్.. మఫ్స్ ఆర్ పేరిట ఓ నూతన బ్లూటూత్ హెడ్‌సెట్‌ను విడుదల చేసింది. ఇందులో కాల్స్ కోసం మైక్‌ను కూడా ఏర్పాటు చేశారు. హైక్వాలిటీ మెటీరియల్‌తో ఈ హెడ్‌ఫోన్స్‌ను తయారు చేసినందున ఇవి ఎక్కువ కాలం మన్నుతాయని ఆ కంపెనీ చెబుతున్నది. ఈ హెడ్‌ఫోన్స్‌తో 3.5ఎంఎం ఆక్సిలరీ కేబుల్‌ను అందిస్తున్నారు. ఈ హెడ్‌సెట్ స్మార్ట్‌ఫోన్లకు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది. 10 మీటర్ల దూరం వరకు ఈ హెడ్‌సెట్ పనిచేస్తుంది. ఇందులో 40 ఎంఎ డ్రైవర్ యూనిట్‌ను ఏర్పాటు చేసినందున ఈ హెడ్‌ఫోన్స్ అత్యుత్తమ క్వాలిటీ కలిగిన సౌండ్ అవుట్‌పుట్‌ను ఇస్తాయి.

ఒకసారి ఈ హెడ్‌ఫోన్స్‌ను చార్జింగ్ చేస్తే 10 నుంచి 15 గంటల పాటు నిరంతరాయంగా ఉపయోగించుకోవచ్చు. రూ.3,999 కే ఈ హెడ్‌ఫోన్స్‌ను అమెజాన్ సైట్‌లో విక్రయిస్తున్నారు. అయితే లాంచింగ్ సందర్భంగా ఈ హెడ్‌ఫోన్స్‌ను రూ.2,599 కే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు.

Related Stories: