ఆ థియేటర్లపై చర్యలు హర్షణీయం..

ఖైరతాబాద్: నగరంలోని మల్టీఫ్లెక్స్, సినిమా థియేటర్లలో తినుబండారాలను, శీతల పానియాలను ఎమ్మార్పీ ధరలకంటే అధిక రేట్లకు విక్రయిస్తున్న యాజమాన్యాలపై తెలంగాణ రాష్ట్ర తూనికల కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ కేసులు నమోదు చేయడం హర్షణీయమని సినీ ప్రేక్షకుల వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు పూర్ణచందర్ అన్నారు.

సోమాజిగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మామూలు మార్కెట్‌లో లభించే కొన్ని వస్తువులకు సొంత బ్రాండ్‌గా తమ సొంత స్టిక్కర్లు అంటించి పలు షాపింగ్ మాళ్ల యాజామాన్యాలు అధిక ధరలకు విక్రయిస్తున్నాయని, ఓ సినియా థియేటర్‌లో 500 మిల్లీలీటర్ల నీటి బాటిల్‌ను రూ. 60కు అమ్ముతున్నారని, తినుబండారాల రేట్లకు అడ్డు అదుపు ఉండదన్నారు. కంట్రోలర్ అకున్ సబర్వాల్ నిబంధనలు పాటించని వారిపై ఉక్కు పాదం మోపడం అభినందనీయమని, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు హర్షిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఎమ్మార్పీ ధరల కంటే అధిక రేట్లకు విక్రయించే వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని ఆయన ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

Related Stories: