పట్టాలు తప్పిన పూజ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

జైపూర్ : రాజస్థాన్‌లోని ఫులేరా రైల్వేస్టేషన్‌కు సమీపంలో పూజ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ రైలు అజ్మీర్ నుంచి జమ్మూ తావికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. పూజ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Related Stories: