జ్యోతిక‌పై మ‌రోసారి పోలీస్ కేసు ..!

‘36 వయదినిలే’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన జ్యోతిక ప్ర‌స్తుతం ప‌లు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు చేస్తుంది. ఇటీవల ‘మగళీర్ మట్టుం’తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో హోమ్లీగా కనిపించింది. తాజాగా కోలీవుడ్ సంచలన దర్శకుడు బాల దర్శకత్వంలో నాచియార్ అనే మూవీ చేసింది. ఈ మూవీ నిన్న‌నే విడుద‌లైంది. ఇందులో క్రూరమైన కిల్లర్ గా కనిపించింది జ్యోతిక. శివ పుత్రుడు , నేనే దేవుడ్ని , వాడు వీడు లాంటి చిత్రాలు తెర‌కెక్కించిన‌ బాల ఈ చిత్రాన్ని కూడా అద్భుతంగా తెర‌కెక్కించాడు. అయితే ఈ చిత్రాన్ని ప‌లు వివాదాలు చుట్టుముట్ట‌డం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ మ‌ధ్య చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా పోలీస్ డ్రెస్ లో ఉన్న జ్యోతిక తమిళంలో ఓ బూతు డైలాగ్ (ల.. కొడక) తిట్టేసింది. దీంతో జ్యోతికపై మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసాయి. రాజన్ అనే డ్రైవర్ మహిళల మనోభావాలని కించపరిచేలా మాట్లాడినందుకు మెట్టుపలయం మెజిస్ట్రేట్ కోర్టులో పిటీషన్ వేశాడు. దీనిపై విచారణ చేపట్టిన మెజిస్ట్రేట్ కోర్టు ఈ వివాదంపై కేసు నమోదు చేసి నివేదిక సమర్పించాల్సిందిగా మెట్టుపాళాయం పోలీసులని ఆదేశించింది. ఇక తాజాగా సినిమా విడుద‌ల కావ‌డంతో మూవీలోని కొన్ని స‌న్నివేశాలు వివాదాల‌ని సృష్టిస్తున్నాయి. చిత్రంలోని ఒక సన్నివేశంలో ‘మాకు ఆలయాలయినా, చెత్తకుప్పలు అయినా ఒకటే’ అంటూ జ్యోతిక‌ మాట్లాడిన సంభాషణలు హిందూ దేవాలయాలను అవమానించేవిగానూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని హిందూ మక్కళ్‌ కట్చి ప్రచార విభాగ అధ్యక్షుడు కాళీకుమార్ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మ‌నోభావాల‌ని దెబ్బ తీసేలా ఉన్న డైలాగుల‌ని వెంట‌నే తొలగించాల‌ని త‌న ఫిర్యాదులో పేర్కొన్నాడు కాళీ కుమార్‌. ఈ వివాదంపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ప్ర‌స్తుతం విచార‌ణ చేప‌ట్టిన‌ట్టు తెలుస్తుంది. నాచియార్ చిత్రంలో ప్రముఖ సంగీత ద‌ర్శ‌కుడు జీవీ ప్ర‌కాశ్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే.

Related Stories: