పలుచోట్ల పోలీసుల కార్డన్‌సెర్చ్

రంగారెడ్డి/జగిత్యాల/మంచిర్యాల : యాచారం మండలం మేడిపల్లిలో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఎల్బీనగర్ ఇంఛార్జ్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 15 బైక్‌లు, ఒక డీసీఎం, 2 ఆటోలతో పాటు 55 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల రూరల్ మండలం టీఆర్ నగర్‌లో ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 50 వాహనాలను స్వాధీనం చేసుకోగా.. 10 మంది అనుమానితులను అరెస్టు చేశారు పోలీసులు. మంచిర్యాల రాజీవ్‌నగర్‌లో డీసీపీ వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో కార్డన్‌సెర్చ్ నిర్వహించి.. సరైన పత్రాలు లేని 53 బైక్‌లు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

Related Stories: