పొద్దంతా టైలర్ పని.. రాత్రివేళ దారుణహత్యలు!

-33 మందిని చంపిన సీరియల్ కిల్లర్ అరెస్ట్ న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో 33 మంది ట్రక్కు డ్రైవర్లను చంపిన ఒక సీరియల్ కిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వాంగ్మూలంలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారులోని మండిదీప్ అనే కుగ్రామానికి చెందిన 48 ఏండ్ల ఆదేశ్ ఖామ్రా.. పగటి వేళల్లో బట్టలు కుడుతూ చుట్టుపక్కల వారికి అమాయకుడిలా కనిపిస్తాడు. చీకటి పడగానే అతడిలోని దొంగ, హంతకుడు నిద్ర మేల్కొంటాడు. హైవేల మీదికెళ్లి మత్తు కలిపిన ఆహారపదార్థాలను లారీలు, ట్రక్కు డ్రైవర్లకు విక్రయించి వారు నిద్రలోకి జారగానే దారుణంగా హత్యచేస్తాడు. ఆ తర్వాత లారీల్లోని వస్తువులను మరికొంతమందితో కలిసి దోచుకోవడమే కాకుండా వాహనాలను ఇతరులకు అమ్మేస్తాడు. ఇలా 2010 నుంచి 2 నెలల క్రితం వరకు 33 మంది డ్రైవర్లను, క్లీనర్లను చంపి అడవిలో పడేసినట్టు వెల్లడించాడు. ఈ సీరియల్ హత్యల్లో ఆదేశ్ ఖమ్రాకు సహకరించిన మరో ఏడుగురిని కూడా భోపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Related Stories: