పాక్ గ‌గ‌న‌త‌లం మీదుగా మోదీ వెళ్ల‌డంలేదు..

హైద‌రాబాద్: కిర్గిస్తాన్‌లో జ‌ర‌గ‌నున్న షాంఘై స‌హ‌కార స‌ద‌స్సులో పాల్గొనేందుకు ప్ర‌ధాని మోదీ వెళ్ల‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న ప్ర‌యాణించ‌నున్న విమానం.. పాకిస్థాన్ గ‌గ‌న‌త‌లం మీదు వెళ్ల‌డం లేద‌ని ఇవాళ విదేశాంగ శాఖ స్ప‌ష్టం చేసింది. కిర్గిస్తాన్ రాజ‌ధాని బిష్కెక్‌లో షాంఘై స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. అయితే కిర్గిస్తాన్‌కు మోదీ విమానం వెళ్లే రూటును ఇవాళ విదేశాంగ శాఖ ప్ర‌తినిధి రావీశ్ కుమార్ వెల్ల‌డించారు. మోదీ విమానం.. ఒమ‌న్‌, ఇరాన్‌, మ‌ధ్య ఆసియా దేశాల మీదుగా బిష్కెక్ వెళ్తుంద‌న్నారు. వాస్త‌వానికి పాక్ మీదుగా వెళ్లేందుకు ముందుగా భార‌త్ ఆ దేశాన్ని ప‌ర్మిష‌న్ కోరింది. అయితే మోదీ విమానం త‌మ గ‌గ‌న‌త‌లం నుంచి వెళ్లేందుకు పాక్ సూత్ర‌ప్రాయంగా అంగీక‌రించింది. కానీ ఇవాళ విదేశాంగ శాఖ మ‌రో రూటుకు క్లియ‌రెన్స్ ఇచ్చింది. బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత పాక్ త‌న ఎయిర్‌స్పేస్‌ను మూసివేసింది. జూన్ 13 నుంచి 14 వ‌ర‌కు స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి.

Related Stories: