ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ.. జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం దేశ ప్రజలకు మోదీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధి వద్ద మోదీ నివాళులర్పించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్, దేవేగౌడతో పాటు పలువురు పాల్గొన్నారు.

Related Stories: