గుజరాత్‌లో నేడు ప్రధాని మోదీ పర్యటన

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు గుజరాత్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. పర్యటన సందర్భంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద వల్సద్‌లో ఎంపికైన లబ్దిదారులకు ప్రధాని సర్టిఫికెట్లు అందజేయనున్నారు. అదేవిధంగా జూనాగఢ్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించనున్నారు.

Related Stories: