బీజేపీ లోక్‌సభాపక్ష నేతగా నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ : ఈ నెల 17 నుంచి లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 16వ తేదీన బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ కానుంది. ఆ తర్వాత ఎన్డీఏ పక్షాల నేతలు సమావేశం కానున్నారు. దీంతో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను బీజేపీ పార్లమెంటరీ పార్టీ అధికారికంగా ప్రకటించింది. బీజేపీ లోక్‌సభాపక్ష నేతగా నరేంద్ర మోదీ, లోక్‌సభాపక్ష ఉప నాయకుడిగా రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభాపక్ష నాయకుడిగా థావర్ చంద్ గహ్లోత్, రాజ్యసభాపక్ష ఉప నాయకుడిగా పీయూష్ గోయల్ నియామకం అయ్యారు.

Related Stories: