యోగా టీచర్‌గా ప్రధాని మోదీ..త్రీడీ అవతార్..వీడియో

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత జీవితంలో యోగాకు ఎంతటి ప్రాధాన్యమిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతీ పౌరుడు నిత్యజీవితంలో యోగా చేయడం అలవాటు చేసుకోవాలని పిలుపునిస్తూ ప్రధాని మోదీ యోగా టీచర్‌గా మారారు. మన్ కీ బాత్ 42వ ఎడిషన్‌లో భాగంగా ప్రధాని మోదీ త్రికోణాసన (యోగాసనం) చేస్తున్న త్రీడీ యానిమేషన్ వీడియోను విడుదల చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇవాళ ప్రధాని మోదీ మాట్లాడుతూ..తాను యోగా టీచర్‌ను కాదని..కానీ ప్రజలు సజనాత్మకతతో తనను యోగా టీచర్‌గా మార్చారని అన్నారు. నాకు సంబంధించి రూపొందించిన యోగా త్రీడీ వెర్షన్ వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నానని ప్రధాని తెలిపారు.

Related Stories: