గుజరాత్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ

అహ్మదాబాద్: ప్రధాని నరేంద్రమోదీ రేపు గుజరాత్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం వల్సాద్ పట్టణంలో నిర్వహించనున్న సమావేశానికి హాజరవుతారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామిణ్) పథకంనుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి జునాగఢ్ పట్టణంలోని సౌరాష్ట్రకు వెళ్లి వివిధ అభివృద్ధి పనుల్లో పాల్గొననున్నారు. గుజరాత్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సొసైటీలో నిర్మించిన నూతన హాస్పిటల్, సోమ్‌నాథ్ జిల్లా వెరావల్ పట్టణంలో రెండు ఫిషరీస్ కాలేజీలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

Related Stories: