శ్రీలంక పేలుళ్లను తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీలంక పేలుళ్లను తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంతంలో అటువంటి అనాగరిక చర్యలకు చోటులేదన్నారు. ఈ క్లిష్ట సమయంలో భారత్.. శ్రీలంక ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని దేవుడుని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.
More in జాతీయం :