నాడీ శుద్ధి ఆసనం.. త్రీడీ వీడియో షేర్ చేసిన మోదీ

న్యూఢిల్లీ: ఈనెల 21వ తేదీన నాలుగవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగనున్నది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. ఇవాళ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. నాడీ శోధన్ ప్రాణాయామానికి సంబంధించిన త్రీడీ వీడియోను ఆయన షేర్ చేశారు. అనులోమ విలోమ పద్ధతులో చేసే ఈ ప్రాణాయామం గురించి వీడియోలో వివరిస్తారు. ప్రతి రోజూ ఈ ప్రాణాయామ యోగాను చేయడం వల్ల జీవితం ప్రశాంతంగా ఉంటుందని, పాజిటివ్ శక్తి వస్తుందని ట్వీట్‌లో మోదీ చెప్పారు. ప్రాణాయామ యోగాను ఎలా చేయాలన్న అంశాన్ని 3 నిమిషాల వీడియోలో సమగ్రంగా వివరించారు. సుఖాసనంలో చేసే ఈ యోగా వల్ల కలిగే లాభాలను కూడా ఆ వీడియోలో వివరించారు.
× RELATED లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాం : కేఏ పాల్