బోటు ముంపు ఘటనపై ప్రధాని మోదీ విచారం

న్యూఢిల్లీ: ఆంధప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా పాపికొండ టూర్ లో జరిగిన బోటు ముంపు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రదిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఇవాళ జరిగిన బోటు ప్రమాదం అత్యంత బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాను. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని’ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.