కేరళలో ప్రధాని మోదీ.. వరదలపై సమీక్ష

తిరువనంతపురం: పది రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ రాష్ట్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. గత వందేళ్లలో చూడనంత వరదలు రావడంతో కొన్ని రోజులుగా రాష్ట్రం నీళ్లలోనే ఉంది. 13 జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో కోచి చేరుకున్నారు. తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆ రాష్ట్ర‌ గ‌వ‌ర్న‌ర్‌ స‌దాశివం, కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్, ఎన్డీఆర్‌ఎఫ్, త్రివిధ దళాల అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. వరద పరిస్థితిని అంచనా వేసి అవసరమైన సహాయక చర్యలు, పునరావా కేంద్రాల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. ఇప్పటికే సహాయక శిబిరాల్లో సుమారు 3లక్షల మంది ప్రజలు ఉన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వే ఆలస్యమైంది.
× RELATED 3వేల యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్ల కొనుగోలు..