ప్రైవేట్ వర్సిటీల్లో 25% కోటాపై వివరాలివ్వండి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం ప్రకారం ప్రైవేట్ వర్సిటీల్లో తెలంగాణ స్థానికులకు 25 శాతమే కోటాను కేటాయించారనే అంశంపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా స్థానిక కోటాను 85 శాతం కాదని.. 25 శాతమే కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

Related Stories: