వారికి రాజకీయ పునర్జన్మనిచ్చింది టీఆర్‌ఎస్సే

-కొండా దంపతులపై టీఆర్‌ఎస్ నేతల ఫైర్ వరంగల్, నమస్తేతెలంగాణ: కొండా దంపతులు టీఆర్‌ఎస్‌ను విమర్శించడంపై గులాబీ నేతలు ఫైర్ అయ్యారు. రాజకీయ పునర్జన్మనిచ్చిన టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను మరిచి నిందలు వేయడంపై ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, సీతారాంనాయక్, తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, మహిళ ఆర్థిక సహకార సంస్థ చైర్‌పర్సన్ గుండు సుధారాణి, మేయర్ నరేందర్ మండిపడ్డారు. సోమవారం నిర్వహించిన వరంగల్ తూర్పు నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తూర్పు ప్రజలు కొండా దంపతులను అక్కున చేర్చుకుంటే ఆ నియోజకవర్గంలో అరాచకం సృష్టించారన్నారు.