టాప్ గేర్‌లో కారు..

హైద‌రాబాద్: తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంద‌ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన రిపోర్ట్ నిజ‌మైంది. ఇవాళ కౌంటింగ్ మొద‌లైన త‌ర్వాత‌.. ఆ పార్టీ దూసుకెళ్లుతున్న‌ది. కారు జోరుకు బ్రేక్ లేద‌ని తేలింది. ఇప్ప‌టికే మ్యాజిక్ మార్క్‌ను దాటేసింది. ఇక ప్ర‌భుత్వ ఏర్పాటు లాంచ‌న‌మే. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ టీమ్ సూప‌ర్ షో ప్ర‌ద‌ర్శించారు. ఇండియాటుడే గ్రూప్ ఇచ్చిన స‌ర్వే రిపోర్ట్ నిజ‌మైన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ది. టీఆర్ఎస్ పార్టీకి సుమారు 91 సీట్లు వ‌స్తాయ‌ని ఆ గ్రూప్ అంచ‌నా వేసింది. ఆ అంచ‌నాకు త‌గ్గ‌ట్లే.. కేసీఆర్ టీమ్ ర‌ఫాడించిన‌ట్లు తెలుస్తోంది. గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సీఎం చంద్ర‌శేఖ‌ర్ రావు లీడింగ్‌లో ఉన్నారు. నీటిపారుద‌ల శాఖ మంత్రి టీ.హ‌రీష్ రావు కూడా భారీ మెజారిటీతో దూసుకెళ్లుతున్నారు. సిద్ధిపేట నుంచి ఆయ‌న పోటీలో ఉన్నారు. హ‌రీష్ ఈసారి ల‌క్ష మెజారిటీ దాటే అవ‌కాశాలు ఉన్నాయి. తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ హేమాహేమీలు తొలి రౌండ్ల‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నారు.

Related Stories: