రజనీ సరికొత్త లుక్!

రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం పేట్ట. కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రిష కథానాయిక. విజయ్ సేతుపతి, శశికాంత్, సిమ్రాన్, మేఘా ఆకాష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీసింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రజనీ నటిస్తున్న 165వ చిత్రమిది. అత్యంత భారీ స్థాయిలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ మోషన్ టీజర్‌ను ఇటీవల చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మోషన్ టీజర్‌లో నల్లని కళ్లజోడు... మెడలో తెల్లని రుమాలు ధరించి ైస్టెలిష్ లుక్‌లో రజనీ కనిపించారు. అయితే దానికి భిన్నమైన గెటప్‌లో వున్న రజనీ సెకండ్ లుక్‌ను తాజాగా చిత్ర వర్గాలు విడుదల చేశాయి. తెల్లని లుంగీ...వైట్ షర్ట్ ధరించి మీసం మెలేసి రజనీ కనిపిస్తున్న లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 67 ఏళ్ల రజనీ తాజా లుక్‌లో మాత్రం మూడు పదుల వయసులో వున్నట్టుగా కనిపిస్తుండటం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. రజనీ మార్కు మాస్ అంశాలతో పక్కా అంశాలతో మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు విభిన్నమైన గెటప్‌లలో రజనీకాంత్ కనిపించనున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది.

× RELATED ముఖ్య అతిథులుగా..