కాపలాకు వెళ్లిన రైతు దారుణ హత్య !

దండేపల్లి : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట సమీపంలో రాజుగూడ పంచాయతీ పరిధిలోని కుంటలగూడకు చెందిన గిరిజన రైతు మార్నేని పెద్ద మైసయ్య(60) గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. సమీపంలో ఉన్న పొలం వద్ద కాపలాకు వెళ్లిన మైసయ్య శవమై పడి ఉండటాన్ని చూసి గ్రామస్థులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు అక్కడికి చేరుకొని చూడగా కర్రతో ముఖంపై బలంగా గాయపర్చిన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడికి చేరుకొన్న పోలీసులు హత్యగా భావించి సంఘటనా స్థలం వద్ద జాగిలాలతో తనిఖీ చేయించారు. జాగిలం కుంటలగూడ వైపు వెళ్లి ఆగిపోయింది. సంఘటన స్థలాన్నీ లక్షెట్టిపేట సీఐ శ్రీనివాస్, ఎస్సై సంజీవ్ పరిశీలించారు. మృతుడి కుమారుడు ఎర్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Related Stories: