ఆరని పెట్రోమంట

-కొత్త రికార్డు స్థాయికి చేరుకున్న ఇంధన ధరలు -హైదరాబాద్‌లో 15 పైసల చొప్పున పెరిగిన పెట్రోల్, డీజిల్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: పెట్రోమంటల నుంచి ఇప్పట్లో సామాన్యుడికి ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేవు. రోజుకొక రికార్డు స్థాయికి చేరుకుంటున్న ఇంధన ధరలు మంగళవారం మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. పెట్రోల్, డీజిల్ ధరలను 14 పైసల చొప్పున పెంచుతున్నట్లు ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) వెల్లడించింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.87కి, డీజిల్ రూ.72.97కి చేరుకున్నది. అదే ఆర్థిక రాజధాని ముంబైలో రూ.88.26 పలికిన పెట్రోల్ ధర, డీజిల్ రూ.77.47గా నమోదైంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు ఎగబాకి రూ.85.75కి, డీజిల్ మరో 15 పైసలు పెరిగి రూ.79.37 వద్ద నిలిచాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనమవడంతో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీలో ఇంధన ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ పన్నులు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం.

Related Stories: