4 రూపాయల చిల్లర ప్రాణం తీసింది..

హైదరాబాద్: నాలుగు రూపాయల చిల్లర ఓ వ్యక్తి ప్రాణాలమీదికొచ్చింది. చిల్లర కోసం షాపు యజమానితో జరిగిన ఘర్షణ లో రాజేశ్ అనే వ్యక్తి మృతి చెందిన ఘటన హయత్‌నగర్ సమీపంలో చోటు చేసుకుంది. రాజేశ్ సిగరేట్ తీసుకుని చిల్లర ఇవ్వలేదని షాపు యజమానితో గొడవపడ్డాడు. దీంతో ఆ షాపు యజమాని తన స్నేహితులతో కలిసి రాజేశ్‌ను చితక బాదారు. ఐదుగురు వ్యక్తులు ఓకేసారి దాడి చేయడంతో రాజేశ్ భయంతో పరుగులు పెట్టాడు. రాజేశ్ పరుగులు పెడుతూ ప్రధాన రహదారిపైకి రావడంతో అటుగా వస్తున్న లారీ అతన్ని ఢీకొట్టింది. దీంతో రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యమంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు షాపు యజమాని సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Related Stories: