పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య

రంగారెడ్డి: హయాత్‌నగర్ సమీపంలో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గుర్తించి మంటలు ఆర్పేలోపు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు నల్లగొండ జిల్లా చౌటుప్పల్ హనుమాన్‌నగర్ వాసి కనకయ్యగా గుర్తించారు. కుమారుడి అనారోగ్యంతో కనకయ్య మనోవేదనకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు.

Related Stories: